Events

Events

Up ComingEvents

img

దాతృత్వం చాటుకున్న శారద సేవా నిధి సొసైటీ

తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు మిట్టగడుపుల రాములమ్మకు శారదా సేవా నిధి సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం 50కేజీల బియ్యం తోపాటు నిత్యవసర వస్తువులను అందజేసి దాతృత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా సొసైటీ కోశాధికారి రెడ్డబోయిన నాగరాజు మాట్లాడుతూ శారద సేవా నిధి సొసైటీ ఆధ్వర్యంలో మండలంలో మునుముందు సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడుతూ పేదలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాలె కమలాకర్, మేడ్దుల సుధాకర్, పూర్వ శారదావిద్యమందిర్ స్కూల్ టీచర్ బింగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

img

Please donate if you can. Every contribution helps! Sharadha Seva Nidhi Society raising funds for Bale Sathyavathi

అందరికీ నమస్కారం. మూడు పదులు దాటని వయసు. 5 ఏళ్ల కూతురు. ప్రస్తుతం గర్భిణీ. పగవాడికి కూడా రావొద్దని కోరుకునే కష్టం ఇప్పుడు ఆ కుటుంబాన్ని దుఃఖంలో నెట్టింది. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన బాలే సత్యవతి కి ఈ నెల 19 న ఆకస్మికంగా పక్షవాతం లా వస్తే ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం అత్యవసవర చికిత్స చేస్తున్నారు. ఆపరేషన్ చేయడానికి 12 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. నిరుపేద కుటుంబానికి ఆస్పత్రి ఖర్చులు భారంగా మారాయి. అందుకే మనవంతుగా తలో చేయి వేద్దాం. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచి సత్యవతి మళ్లీ ఆరోగ్యంగా ఇంటికి చేరుకునేందుకు తోడ్పాటు అందిద్దాం.. 💐🙏🏼 Sharadha Seva Nidhi Society Bank & Branch : HDFC & Suryapet A/C No: 50200085553293 IFSC Code: HDFC0001637

img

🙏 చిన్నారి కోసం మన సహాయం

🙏 చిన్నారి కోసం మన సహాయం Autism & ADHD సమస్యలతో బాధపడుతున్న ఒక చిన్నారి చికిత్స కోసం మన సహాయం అవసరం ఉంది. మన చిన్న సహాయం కూడా ఒక కుటుంబానికి పెద్ద ఆశ అవుతుంది. శారదా సేవా నిధి సొసైటీ తరఫున ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి. మీకు సాధ్యమైనంత సహాయం చేసి ఈ చిన్నారి భవిష్యత్తుకు వెలుగు ఇవ్వండి. ❤️ 💳 సహాయం పంపేందుకు బ్యాంక్ వివరాలు: Account Name: Sharadha Seva Nidhi Society Bank: HDFC Bank Branch: Suryapet A/C No: 50200085553293 IFSC Code: HDFC0001637 📢 దయచేసి ఈ పోస్టును మీ ఫ్రెండ్స్ & గ్రూప్స్‌లో షేర్ చేయండి 🙏 #HelpChild #SupportAutism #ADHD #SharadaSevaNidhi #DonateAndSupport

Lets make a difference in the life of others